ఓటు వేయకపోతే నా మీద ఒట్టు: ఎమ్మెల్యే
BHNG: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రచారంలో ఆసక్తికర వాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా ఒక్క ఓటు బీఆర్ఎస్ పార్టీకి పోయినా నా మీద ఒట్టు అంటూ ఓటర్లను ఉద్దేశించి ప్రసగించారు. మీరు ఎవరికి ఓటు వేశారో నాకు తెల్సిపోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయండి అని పేర్కొన్నారు. ఆ వీడియో వైరల్ కాగా, సదరు ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ.. BRS పార్టీ ఆరోపణలు చేస్తుంది.