చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
W.G: తణుకులో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు కోర్టు బయట ఆవరణలో ఆర్యవైశ్య సేవా సంఘం & చాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి, మాట్లాడారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను పెంపొందించే ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయన్నారు.