రద్దవుతున్న గల్ఫ్ విమానాలు

రద్దవుతున్న గల్ఫ్ విమానాలు

పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలు విమాన సర్వీసులను పరిమితంగా నడుపుతున్నాయి. దీంతో దుబాయ్, అబూధాబీ, కువైట్‌లకు రాకపోకలు కొనసాగిస్తున్న పలు అంతర్జాతీయ సర్వీసులు రద్దయ్యాయి. ఈనెల 1 నుంచి 13 వరకు గల్ఫ్ దేశాల నుంచి రావాల్సినవి 210, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 224 విమాన సర్వీసులు రద్దయ్యాయి.