ఎమ్మెల్యేగా గెలిచి సీఎం జగన్‌కు గిఫ్ట్‌గా ఇస్తా: పిరియా విజయ

ఎమ్మెల్యేగా గెలిచి సీఎం జగన్‌కు గిఫ్ట్‌గా ఇస్తా: పిరియా విజయ

SKLM: వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పిరియా విజయను అధిష్టానం ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు పిరియా విజయ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపిక చేయడం పట్ల విజయ హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చాపురం ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రికి గిఫ్ట్‌గా ఇస్తానని తెలిపారు. 2024లో వైసీపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని పేర్కొన్నారు.