ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

VSP: చోడవరం ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్ దాటుతుండగా, అనకాపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వైన్ షాప్‌లో పనిచేస్తున్న ఆలీ కాలు నుజ్జయి తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.