సమగ్ర క్రీడా పాలసీ తీసుకురావాలి: కేటీఆర్
HYD: తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నందినగర్ నివాసంలో కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు చెక్కులు, ట్రోఫీలను అందజేసిన అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో సమగ్ర క్రీడా పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని, వచ్చే BRS ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తామనన్నారు.