ఆవిష్కరణ రంగంలో తెలంగాణ ముందంజ: ఉత్తమ్
TG: స్టార్టప్‌లకు మద్దతు, ఉపాధి సృష్టి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశ ఆవిష్కరణ రంగంలో రాష్ట్రం ముందంజలో ఉండగా.. రక్షణ పరిశోధన, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, ఔషధ తయారీ రంగాల్లో హైదరాబాద్ కీలక కేంద్రంగా ఉందని పేర్కొన్నారు. వర్సిటీలు మధో సంపత్తి, స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రాలుగా మారాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.