సీఎం చిత్రపటానికి రైతులు పాలాభిషేకం
NTR: రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ పథకం కింద రెండో విడత సొమ్ము డిపాజిట్ అయ్యింది. ఈ సందర్భంగా విజయవాడలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బొండ ఉమా హజరయ్యారు. రైతులకు రూ. 3,92,000 మెగా చెక్కును అందజేశారు. కృతజ్ఞతగా సీఎం చిత్రపటానికి రైతులతో కలసి పాలాభిషేకం చేశారు.