హరీశ్ రావును పరామర్శించిన మంత్రి, ఎంపీ
SDPT: ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ కోకాపేటలోని క్రిన్స్ విల్లాలోని ఆయన నివాసానికి వెళ్లి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. తన్నీరు సత్యనారాయణ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాను. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు.