'ఆక్రమణలు తొలగించాలని ఫిర్యాదు'
AKP: పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం, చీపురుపల్లిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మత్స్యకారుల కోసం నిర్మించిన భవనాలు ఆక్రమణలకు గురయ్యాయని ఆంధ్ర మత్స్యకార జేఏసీ అధ్యక్షుడు అర్జిల్లి అప్పలరాజు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే ప్రభుతో స్థలాలు కూడా ఆక్రమణలకు గురి అయినట్లు పేర్కొన్నారు. విచారణ నిర్వహించి ఆక్రమణలను తొలగించాలన్నారు.