VIDEO: 'విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది'
SRCL: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ మండలం జక్కల్‌లోని ఎస్టీ పాఠశాలలో భోజనం సరిగా లేక విద్యార్థులు రోడ్డెక్కారన్నారు.