బాసరలో భక్తుల రద్దీ.. చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు

బాసరలో భక్తుల రద్దీ.. చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు

ADB: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణమాసం బుధవారం శుభదినం కావడంతో పాటు, మూల నక్షత్రం ఉండడంతో చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాస పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.