'BRS అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి'
JNG: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్క కార్యకర్త పనిచేయాలని మాజీ జెడ్పిటీసీ, జనగామ జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ పస్కూరి శ్రీనివాసరావు సూచించారు. పాలకుర్తి మండలంలోని విస్నూరు, విష్ణుపురం గ్రామాలలో మంగళవారం ఉదయం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపికపై వారు ఈ సమావేశంలో చర్చించారు.