అదుపు తప్పి లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

అదుపు తప్పి లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

ELR: అదుపు తప్పి లారీ బోల్తా పడిన ఘటన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి శివారులో శనివారం చోటుచేసుకుంది. డ్రింకులు రోడ్డుతో వెళ్తున్న లారీ రోడ్డు పక్కన టీ తాగేందుకు డ్రైవర్ నిలిపాడు. అయితే లారీ స్టార్ట్ చేసే సమయంలో ఒక్కసారిగా వెనక్కి కదలడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదు. దీంతో ప్రమాదం తప్పినట్లు అయ్యింది.