పుంగనూరులో ఘనంగా టైలర్స్ డే

CTR: జాతీయ టైలర్స్ డే సందర్భంగా పుంగనూరులో శుక్రవారం టైలర్స్ ఘనంగా నిర్వహించారు. స్థానిక MBT రోడ్డులో కుట్టుమిషన్ రూపకర్త విలియమ్స్ హౌవే చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. అనంతరం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. సంఘ అధ్యక్షులు ఖాసీమ్ మాట్లాడుతూ.. టైలర్స్ అసోసియేషన్ భవనం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్నికోరారు.