ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బాలునాయక్ ప్రజా ప్రతినిధులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడానికి ఉప కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.