హస్తకళా ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్

హస్తకళా ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్

E.G: చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు హస్తకళలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పీ.ప్రశాంతి అన్నారు. శనివారం రాత్రి రాజమండ్రి ఉమా రామలింగేశ్వర కల్యాణ మండపంలో జరిగిన హస్తకళా ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. హస్తకళలను ప్రోత్సహించడం మన సంస్కృతికి, కళాకారుల అభివృద్ధికి అవసరమని తెలిపారు. ఇటువంటి ప్రదర్శనలను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని ఆమె తెలిపారు.