జిల్లాలో ప్రశాంతంగా 'పది' పరీక్షలు షురూ

జిల్లాలో ప్రశాంతంగా 'పది' పరీక్షలు షురూ

KMR: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 65 కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిబంధనల మేరకు విద్యార్థులను అరగంట ముందే లోపలికి అనుమతించారు. విద్యాశాఖ అధికారులు, పోలీసులు సమన్వయంతో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.