నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRPT: తుంగతుర్తి మండలం కరివిరాల, కొత్తగూడెంలో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపు కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది. కావున గ్రామ ప్రజలు సహకరించాలని తుంగతుర్తి అసిస్టెంట్ ఇంజనీర్ సురేందర్ శుక్రవారం ఉదయం ఒక ప్రకటనలో తెలియజేశారు.