శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

NDL: శ్రీశైల మహాక్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. శ్రీ కృష్ణాష్టమి, ఆదివారం సెలవు దినాలు కావటంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసి కేవలం స్వామివారి అలంకార దర్శనానికే అనుమతిస్తున్నారు.