రాయితీపై వ్యవసాయ పనిముట్లు
JGL: ఉద్యాన యాంత్రీకరణలో భాగంగా రైతులకు వివిధ రకాల పనిముట్లు, యంత్రాల కొనుగోలుపై రాయితీ సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, జగిత్యాల జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యాంప్రసాద్ తెలిపారు. పవర్ టిల్లర్లు, పవర్ విడర్లు, పవర్ స్పెయర్లూ, బ్రష్ కట్టర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు తమ పరిధికి చెందిన ఉద్యాన అధికారులను సంప్రదించాలన్నారు