సల్మాన్ 'రనౌట్'.. పాక్ మాజీ ప్లేయర్ చురకలు
2వ వన్డేలో పాక్ ప్లేయర్ సల్మాన్ ఆఘాను బంగ్లా రనౌట్ చేసిన తీరు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే 2 చేతులు కలవకుండా చప్పట్లు కొట్టలేమని, క్రీజులో లేకపోవడం వల్లే ఇదంతా జరిగిందని ఆఘాకు పాక్ మాజీ ప్లేయర్ బసిత్ అలీ చురకలంటించాడు. ఇలాంటి ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయని.. 1999 కోల్‌కతా టెస్టులో సచిన్‌ను షోయబ్ అక్తర్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని రనౌట్ చేశాడని గుర్తుచేశాడు.