VIDEO: చెరిగిన బోర్డు.. కనిపించని గ్రామాల పేర్లు
SRPT: అనంతగిరి నుంచి త్రిపురవరం, వల్లపురం గ్రామాలకు వెళ్లే రహదారిపై సూచిక బోర్డు చెరిగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బోర్డుపై పేర్లు కనిపించకపోవడంతో కొత్తగా వచ్చే వారికి దారి తెలియక గందరగోళం నెలకొంటోంది. రాత్రి సమయాల్లో ఈ సమస్య మరింత తీవ్రమవుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. వెంటనే నూతన బోర్డు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.