VIDEO: శీతల గంగమ్మకు ప్రత్యేక పూజలు

కడప: సిద్ధవటం మండలం మాధవరం -1 పంచాయతీ పార్వతీపురంలో వెలసిన శీతల గంగమ్మ అమ్మవారికి గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ పూజారి రంగమ్మ అమ్మవారిని నిమ్మకాయ మాలలతో సుందరంగా అలంకరించారు. మహిళలు తప్పెట్లతో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.