భవాని మాతగా రామలింగేశ్వర స్వామి దర్శనం..

భవాని మాతగా రామలింగేశ్వర స్వామి దర్శనం..

MLG: వెంకటాపుర్ (M) రామప్ప దేవాలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా రామలింగేశ్వర స్వామి భవాని మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున స్వామివారికి అభిషేకాలు నిర్వహించగా, ఆలయ అర్చకులు హరీశ్ శర్మ ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.