VIDEO: నందిగామలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
NTR: నందిగామలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దుర్గా రెస్టారెంట్, రైతుపేటలోని రెడ్డి హోటల్, TTD కళ్యాణ మండపం పక్కనున్న స్వీట్ షాపుల్లో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా లైసెన్స్ లేని రెండు స్వీట్ షాపులు గుర్తించి, హల్వా నమూనాలు సేకరించారు. రెడ్డి హోటల్ వంటగది అపరిశుభ్రంగా ఉండటంతో కేసు నమోదు చేశారు. రంగు కలిపిన క్యాబేజీని సేకరించి ల్యాబ్‌కు పంపించారు.