జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో మంత్రి

సత్యసాయి: వడిసలేరు గ్రామంలో మంగళవారం జరిగిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. పోతుల్ల పద్మరాజు సీతమ్మ మెమోరియల్ జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు అల్బెండజోల్ మందులు అందజేశారు. పిల్లల ఆరోగ్యాన్ని బలోపేతం చేసి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.