అసోసియేషన్ బ్యాలెట్ నమూనా విడుదల
KRNL: ఆదోని బార్ అసోసియేషన్ కార్యవర్గం కోసం నిర్వహించే ఎన్నికల్లో బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ ఉంటుందని ఎన్నికల అధికారులు విజయ్ బాస్కర్ రెడ్డి, విరెష్, హుసేని సాని తెలిపారు. శుక్రవారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో బ్యాలెట్ నమూనా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదోని బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ నమూనాను పేర్లు వారిగా రూపొందించామన్నారు.