కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

CTR: చౌడేపల్లి మండలం బిల్లేరు గ్రామంలో సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శుక్రవారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అర్చకులు ఉత్సవమూర్తులను అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత ప్రత్యేక మండపంపై కొలువు తీర్చి శాస్రోత్తకంగా కళ్యాణాన్ని జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు గ్రామస్థులు విశేష సంఖ్యలో తరలివచ్చారు.