జిల్లా ఏఎస్పీగా అంకిత మహావీర్
సత్యసాయి: జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా సూరన అంకిత మహావీర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈమె త్వరలోనే పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లాకు మొట్టమొదటి మహిళా ఏఎస్పీగా అంకిత మహావీర్ నియమితులు కావడం గమనార్హం.