నితీష్ ఇంటి వద్ద JDU నేతల ఆందోళన

నితీష్ ఇంటి వద్ద JDU నేతల ఆందోళన

బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తానన్న ప్రకటన JDUలో కలకలం రేపింది. ఆయన ఇంటి ముందే పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. నితీష్ సీఎంగానే కొనసాగాలని, ఒకవేళ రాజ్యసభ సీటు కావాలనుకుంటే ఆయన కుమారుడు నిశాంత్‌ను పంపాలని పార్టీ నేత రాజీవ్ రంజన్ డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. అమిత్ షా రాకముందే సొంత పార్టీలోనే ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం బీహార్ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.