నేషనల్ హెరాల్డ్.. డీకే శివకుమార్‌కు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో డీకే శివకుమార్‌కు EOW నోటీసులు జారీ చేసింది. ఆర్థిక విషయాలు, లావాదేవీపై శివకుమార్ వివరణ కోరుతూ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 19లోపు వివరాలు సమర్పించాలని EOW అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు కొత్త FIR నమోదు చేసిన విషయం తెలిసిందే.