'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధమ ప్రాధాన్యత'
RR: మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన 'ప్రజావాణి' కార్యక్రమంలో గౌరవ పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ గారు పాల్గొని, ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను అధికారులతో కలిసి సమీక్షించారు. ముఖ్యంగా డ్రైనేజీ, రోడ్లు వంటి మౌలిక వసతుల సమస్యలపై తక్షణమే స్పందించి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.