KKD: 'పిల్లలతో భిక్షాటన చేయించడం నేరం'
KKD: పిల్లలతో భిక్షాటన చేయించడం నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని చైల్డ్ ప్రొడక్షన్ జిల్లా ఇంఛార్జ్ విజయ పేర్కొన్నారు. భిక్షాటన చేస్తున్న పిల్లలను, వీధి బాలలను, బాల కార్మికులను గుర్తించడంలో భాగంగా ప్రజా చైతన్య కార్యక్రమాన్ని సామర్లకోటలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సోమవారం ప్రారంభించారు. బాలలకు చదువే ముద్ధు అని సూచించారు.