VIDEO: ఉయ్యూరులో “రైతన్నా మీ కోసం” కార్యక్రమం
కృష్ణా: ఉయ్యూరు మార్కెట్ యార్డు పరిధిలోని ఆకునూరులో “రైతన్నా మీ కోసం” కార్యక్రమం బుధవారం నిర్వహించారు. పీఎం కిసాన్ ద్వారా రాష్ట్రంలో లక్షలాది రైతులకు నిధులు జమయ్యాయని ఏఎంసీ ఛైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ తెలిపారు. పామాయిల్ తోటలు, యంత్రాలు, డ్రోన్ల ద్వారా ఆదాయం పెంపుపై అవగాహన కల్పించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా సేవలు పొందాలని సూచించారు.