రేపు పోలవరం రానున్న ఏపీ గవర్నర్
ELR: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈనెల 2న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి వస్తున్నారని కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం తెలిపారు. ఆమె ఏలూరు కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గవర్నర్ పోలవరం ప్రాజెక్టు పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.