వారం రోజులపాటు మహిళ సాధికారిత వారోత్సవాలు

వారం రోజులపాటు మహిళ సాధికారిత వారోత్సవాలు

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా వారం రోజులపాటు మహిళ సాధికారిత వారోత్సవాలను మార్చి 8 వరకు నిర్వహించనున్నట్లు డీఎస్పీ గోవిందరావు ఆదివారం తెలిపారు. వారోత్సవాల్లో బాగంగా కోట జంక్షన్ నుండి మూడు లాంతర్ల వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ర్యాలీలో మహిళలకు అనుకూలంగా నినాదాలు చేస్తారన్నారు.