లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

KMR: రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన వడ్ల లత, గొడుగు తండాకు చెందిన సరోజ ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ మేరకు ముఖ్య మంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.60 వేల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరైంది. దీంతో ఆదివారం జడ్పీటీసీ మాజీ సభ్యుడు నారెడ్డి మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు.