అక్రమ ఇసుక రవాణా.. ట్రాక్టర్లు స్వాధీనం

అక్రమ ఇసుక రవాణా.. ట్రాక్టర్లు స్వాధీనం

కరీంనగర్ రూరల్ పోలీసుల పెట్రోలింగ్‌లో భాగంగా మానకొండూర్ మండలం వెల్ది, బొమ్మకల్, వల్లంపహాడ్ ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు. అజయ్, కుమార్, అనిల్ కుమార్‌లు తమ యజమానుల ఆదేశాల మేరకు ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.