పద్మశ్రీ డాక్టర్ రామకృష్ణారెడ్డి చిత్రపటానికి నివాళులు

CTR: కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయ వ్యవస్థాపక రిజిస్ట్రార్ పద్మశ్రీ డాక్టర్ బి.రామకృష్ణారెడ్డి మృతికి ద్రావిడ వర్సిటీ ఉద్యోగులు సంతాపం తెలిపారు. వీసీ ఆచార్య ఎం.దొరస్వామి నివాళులు అర్పించారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి, సాహితీ లోకానికి పద్మశ్రీ బి.రామకృష్ణ చేసిన సేవలు గురించి కొనియాడారు.