శివాజీ విగ్రహ స్థల వివాదం..ఆర్డీవో కార్యాలయంలో చర్చలు
WGL: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలో శివాజీ విగ్రహం ఏర్పాటు స్థల వివాదం కొనసాగుతోంది. గ్రామం రెండు వర్గాలుగా విడిపోవడంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. అనంతరం ఆర్డీవో, ఏసీపీ ఆధ్వర్యంలో గ్రామంలో చర్చలు జరిపినా పరిష్కారం కుదరలేదు. దీంతో ఇరువర్గాల నుంచి కొందరిని శుక్రవారం ఆర్డీవో కార్యాలయానికి పిలిపించి అధికారులు చర్చలు నిర్వహించనున్నారు.