భర్త మరణాన్ని తట్టుకోలేక.. భార్య మృతి..!
NTR: వాంబేకాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్యాటరింగ్ పనులు చేసే అజయ్ కుమార్ మంగళవారం ఛాతినొప్పితో 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యమార్గంలోనే మృతి చెందాడు. దీంతో ఆయన భార్య నాగలక్ష్మి తీవ్రంగా రోధించింది. అజయ్ కుమార్ అంత్యక్రియలు ముగించుకుని కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి, నాగలక్ష్మి సైతం కన్నుమూసింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.