VIDEO: గంటల మారెమ్మకు ప్రత్యేక పూజలు
సత్యసాయి: గోరంట్ల మండలంలోని గంటల మారెమ్మ దేవస్థానంలో ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయ పూజారులు అమ్మవారికి వివిధ పూలతో అలంకరించి అభిషేకాలు, అర్చనలు చేసి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పాల్గొని అమ్మవారికి పూలు, పండ్లు సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.