VIDEO: డబుల్ బెడ్ రూమ్ కాలనీలో గణనాథుడికి పూజలు

WNP: చిట్యాల రోడ్డులోని డబుల్ బెడ్ రూమ్ ఆదర్శనగర్ కాలనీలో కొలువుదీరిన గణనాథుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు. పూజలలో భాగంగా రెండవ రోజు శుక్రవారం మండపం దగ్గర సూపర్‌వైజర్ రవికుమార్ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ నేతలు బలరాం వెంకటేష్, మండ్లరాజు, సర్దార్ ఖాన్, సాయిలీల, అన్వర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.