VIDEO: పులివెందులలో సీఎం జన్మదిన వేడుకలు

KDP: సీఎం నారా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పులివెందుల టీడీపీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ బీటెక్ రవి చంద్రబాబు పుట్టినరోజు కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా బీటెక్ రవికి టీడీపీ నాయకులు కేకు తినిపించారు. అనంతరం టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు నాయకత్వంవర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.