'ఓటు హక్కుతో ప్రజలను చైతన్యవంతం చేయాలి'
GDWL: కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మణి కుమార్ అన్నారు. ఎర్రవల్లి మండలం బొచ్చు వెంగన్న పల్లిలో ఆయన బూత్ స్థాయి నాయకులతో సమావేశమయ్యారు. ఓటు హక్కుతో స్థానిక ప్రజలను చైతన్యవంతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఫూలే, అంబేద్కర్, కాన్సీరామ్ భావజాలాన్ని ప్రజలకు పరిచయం చేయాలన్నారు. కార్యక్రమంలో శాంతిరాజు, రాముడు, తదితరులు పాల్గొన్నారు.