నదిలో మహిళ గల్లంతు

PPM: భామిని మండలం లివరి గ్రామంలో కుమ్మరి లక్ష్మి(38) అనే మహిళ వంశదార నదిలో శనివారం ఉదయం గల్లంతయింది. విషయం తెలుసుకున్న స్థానిక రెవెన్యూ, పోలీస్ సిబ్బంది వంశధార నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉదయం స్నానానికని వెళ్లిన మహిళ నదిలో గల్లంతయినట్టు స్థానికులు తెలిపారు.