కలెక్టరేట్‌లో ఆధునిక వీసీ హాలు ప్రారంభం

GNTR: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అత్యాధునిక వీడియో కాన్ఫరెన్స్ హాలు అందుబాటులోకి వచ్చింది. మంగళవారం కలెక్టర్ నాగలక్ష్మి ఈ హాలును ప్రారంభించారు. వీసీలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి, హాలును తీర్చిదిద్దామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.