'రహదారి, వంతెన సౌకర్యం కల్పించాలి'
ASR: పాడేరు మండలం దేవాపురం పంచాయతీ తుమ్మలపాలెం, ములకలపాలెం, అర్జాపురం గ్రామాలకు రహదారి, వంతెన సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు నరసింహమూర్తి కోరారు. ఈ మేరకు బుధవారం స్థానికులతో కలిసి నిరసన తెలిపారు. రహదారి, వంతెన లేక నాలుగు గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొండవాగుపై కర్రల వంతెన ఏర్పాటు చేసి, ప్రయాణం చేస్తున్నారని వాపోయారు.