ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి

ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి

HNK: విందు వెళ్లి వస్తూ ఆనంత లోకాలకు వెళ్లిన విషాద ఘటన నడికూడ(M) కౌకొండ శివారులో చోటుచేసుకుంది. దామెర SI ఆశోక్ వివరాల ప్రకారం.. కమలాపూర్(M) అంబాలకి చెందిన ఆటో డ్రైవర్ బోయిని తిరుపతి తోటి ఆటో మిత్రులతో కలిసి కంఠాత్మకూర్ సమ్మక్క- సారలమ్మ గద్దెల వద్దకు విందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో బోల్తాపడి మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.